Telugu Cinema Desha Bhakthi Geethalu:-


We are providing all Desha Bhakthi Geethalu | Desha Bhakthi Geethalu in Telugu | Desha Bhakthi Geethalu in Telugu Lyrics | Telugu Desha Bhakthi Geethalu| Telugu Cinema Desha Bhakthi Geethalu | Andhra and Telangana Desha Bhakthi Geethalu.

Telugu Cinema Desha Bhakthi Geethalu
కలిసిపాడుదాం తెలుగుపాట 
మధురమైన దేశభక్తి పూరితమైన లలితగీతాలు | ప్రయివేటు గీతాలు | సినీగీతాలు | తెలంగాణగీతాలు

బాలబాలికలలో దేశభక్తిని ప్రేరేపించండి:-

నేటి బాలలే రేపటిపౌరులు. కాని సమాజంలోని నేటి పరిస్థితుల వలన భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలలో ఇంటిపట్ల, సమాజంపట్ల, దేశంపట్ల అవగాహనారాహిత్యం పెరిగిపోతున్నది. అందుకే చిన్నారులలో సదాలోచన, సత్ప్రవర్తనలను పెంపొందించాల్సి వుంది.
వందల మాటలు చెప్పి విసిగించే కంటే ఒక్కపాట పాడి వినిపిస్తే మంచిస్పందన కనిపిస్తుంది. సజంగా పిల్లల్లో గ్రహణశక్తి, ధారణశక్తి ఎక్కువ ఉంటుంది. పాటలపట్ల పిల్లలు ఆసక్తి చూపిస్తారు. కనుక పాటను ఆయుధంగా తీసుకొని వారిలో చిన్నతనంలోనే దేశభక్తి బీజాలను నాటాలి. వారి మనసుల్ని చదువులవైపు, దేశభక్తి భావాలవైపు మళ్ళించాలి. దీనిని చెయ్యాల్సింది ముఖ్యంగా టీచర్లు, పేరెంట్స్. ఈ ఉద్దేశ్యంతోనే మన ఈ website ద్వార మీకు దేశభక్తి గీతాలను అందిస్తున్నాము.


సానుకూల దృక్పధం పెంపొందడానికి దేశభక్తి గీతాలు నేర్పాలి:-

విద్యాలయం ఒక దేవాలయం, విద్యతోపాటు అవసరమైన క్రమశిక్షణ, సృజనాత్మకత, కళాత్మక విలువలను విద్యార్ధులలో పెంచే పవిత్రకేంద్రం. విద్యార్ధిపై ఉపాధ్యాయుని ప్రభావం ఎక్కువ వుంటుంది. కనుక చదువు నేర్పే ప్రతి ఉపాధ్యాయుడు తనకు వీలైనప్పుడల్లా సమాజాన్ని, సమాజ పరిస్థితుల్ని పాజిటివ్ దృక్పధంతో తెలియపరచాలి. పిల్లలకు దేశభక్తి పూరిత పాటలను వినిపించి నేర్పించాలి. దీనివలన విద్యార్ధులకు సానుకూల దృక్పధం, సృజనాత్మకశక్తి, జ్ఞాపకశక్తి, స్పష్టమైన ఉఛ్ఛారణ  మొదలైన శక్తులు అలవడతాయి. దేశభక్తి పాటలు రోమాంచితంగాచేసి మనసుల్ని పులకరింప జేస్తాయి. దేశభక్తి పాటలంటే దేశానికి సంభందించినవి మాత్రమేకాదు, దేశమాత, మాతృభాష, దేశనాయకులు, చారిత్రాత్మక అంశాలు, సంఘసంస్కర్తలు, పుట్టిన ప్రాంతాలపై మమకారం మొదలైనవి చాలా అంశాలుంటాయి. కనుక ఈ మన వెబ్ సైట్ లో అలాంటి పాటలన్నిటిని మీకోసం మేము అందిస్తున్నాము.

ఈ దేశభక్తి గీతాలు ప్రతి విద్యార్ధి వద్ధ, ప్రతి పాఠశాలలోను, ప్రతి ఇంట ఉండాల్సినది అని మేము భావిస్తున్నాం. మీరు ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము.  

ఈ క్రింద ఉన్న వాటిలో మీకు నచ్చిన క్యాటగిరిని సెలెక్ట్ చేసుకోండి. క్యాటగిరి ప్రకారము మీకు మేము పాటలను అందిస్తాము.




Please Support to us. Work in Progress, As soon as possible we will update the information.

Labels:

Post a Comment

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.